telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

రాంగ్ రూట్లో వెళ్లిన డీజీపీ కారు.. జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు!

mahender_reddy

చట్టం దృష్టిలో అందరూ సమానులేనని తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు నిరూపించారు. పోలీస్ బాస్ కారు రాంగ్ రూట్లో వెళ్లడంతో జరినామా విధించి విధినిర్వహణలో శభాష్ అనిపించుకున్నారు. ఈ ఘటన తెలంగాణలోని సంగారెడ్డిలో చోటుచేసుకుంది.

ఈ నెల 3న డీజీపీకి చెందిన కారు సంగారెడ్డిలో రాంగ్ రూట్ లో వెళుతుండగా ఎవరో సామాన్యుడు ఫొటో తీసి సోషల్ మీడియా ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో కారు వివరాలను పోలీసులు ఆరా తీయగా, అది తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి పేరుపై ఉన్నట్లు గుర్తించారు. నిబంధనల మేరకు రూ.1,135 ల జరిమానాను ట్రాఫిక్ పోలీసులు విధించారు.

Related posts