telugu navyamedia
తెలంగాణ వార్తలు

హైద‌రాబాద్‌కు చేరుకున్న ప్ర‌ధాని మోదీ..

*హైద‌రాబాద్‌కు చేరుకున్న ప్ర‌ధాని మోదీ..
*ప్ర‌ధానికి స్వాగ‌తం ప‌లికిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై, త‌ల‌సాని శ్రీనివాస్‌
*ఎచ్ ఐ సిసి హెలికాప్ట‌ర్ లో వెళ్ళిన ప్ర‌ధాని మోదీ..
*కాసేపట్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో  మోదీ పాల్గొననున్నారు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్​ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోదీ.. హెలికాప్టర్​లో హెచ్​ఐసీసీకి చేరుకున్నారు.

ప్రధాని మోదీకి గవర్నర్​ తమిళిసైతో పాటు రాష్ట్రప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ స్వాగతం పలికారు.బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రధానికి ఘనస్వాగతం పలికింది.

అనంతరం బేగంపేట నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్​లో నోవాటెల్​ హోటల్​కు వెళ్లారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి హెలికాప్టర్​లో హెచ్​ఐసీసీకి చేరుకున్నారు.కాసేపట్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మోదీ పాల్గొంటారు.రాత్రికి నోవాటెల్‌లో ప్రధాని బస చేయనున్నారు.

మరోవైపు ఇప్పటికే హెచ్​ఐసీసీకి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేరుకోగా ఆయనకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్‌చుగ్‌, టీ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ స్వాగతం పలికారు.

కాగా..ప్రధానికి స్వాగతం అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధానికి స్వాగతం పలికానన్నారు. సీఎం తప్పనిసరిగా స్వాగతం పలకాలన్నది ఎక్కడా లేదన్నారు. గతంలో మోదీ వచ్చినప్పుడు కేసీఆర్‌ స్వాగతం పలికారు.

Related posts