telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

జంతువుల నుంచి మనుషులకు కొత్త వ్యాధి…

is cancer inherited disease

ప్రపంచాన్ని ఇప్పటికే కరోనా మహమ్మారి వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచంలో కరోనా లాంటి మహమ్మారులు అనేకం ఇంకా పొంచి ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.  కొన్నేళ్ల కిందటే డిసీజ్ ఎక్స్ అనే ప్లేస్ హోల్డర్ ను గుర్తించింది.  అయితే, ఇది ఇంకా వెలుగులోకి రాలేదని, ఒక్కసారి ఈ డిసీజ్ వెలుగులోకి వస్తే తీవ్రమైన మహమ్మారిగా మారే అవకాశం ఉంటుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది.  ఇప్పటి నుంచి ప్రపంచ దేశాలు మహమ్మారిపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది.  ఈ కొత్త వైరస్ జూనోటిక్ వ్యాధుల వలన వచ్చే అవకాశం ఉందని, ఇది జంతువుల నుంచి మనుషులకు సంక్రమించవచ్చని నిపుణులు చెప్తున్నారు.  గతంలో అనేక మహమ్మారులను మానవాళి ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.  ప్లేగ్ మహమ్మారి వలన 75 మిలియన్ మంది మరణించారు.  కరోనాతో 2.3 మిలియన్ల మంది మృత్యువాత పడ్డారు.  రాబోయే కాలంలో కొత్త మహమ్మారుల వలన 75 మిలియన్ కంటే ఎక్కువ మంది మరణించే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.  అడవుల నరికివేత, వ్యవసాయం విస్తరణ, మైనింగ్ తవ్వకాలు, అడవి జంతువుల వేట వంటి వాటి వలన మహమ్మారులు ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్నాయని, సమతుల్యత కోల్పోవడంతో కొత్త కొత్త మహమ్మారులు పుట్టుకు వస్తున్నట్టు నిపుణులు చెప్తున్నారు. 

Related posts