telugu navyamedia
తెలంగాణ వార్తలు

రేవంత్ రెడ్డితో ఎలాంటి గ్యాప్ లేదు..ఆయన ఢిల్లీలో ఉండటం వల్ల రాలేదు

తనకు టీసీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మధ్య ఎలాంటి గ్యాప్ లేదని మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. ఈ రోజు విష్ణువర్ధన్​రెడ్డి ఇంట్లో విందు సమావేశానికి కాంగ్రెస్​ సీనియర్​ నేతలు హాజరయ్యారు.

తాను ఈ విందు ఏర్పాటు చేయడంలో ఎలాంటి వ్యూహం లేదని, ప్రతిసారి విందు ఏర్పాటు చేస్తానని, అలాగే ఈ సారి కూడా లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశానని అన్నారు. అందుకోసం హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న కాంగ్రెస్ సీనియర్లను ఆహ్వానించినట్లుగా చెప్పారు. అప్పుడప్పుడూ వారిని కలుస్తూనే ఉంటానని, ఈ మధ్య చాలా గ్యాప్‌ వచ్చినందుకే తాజాగా సీనియర్ లీడర్లను భోజనానికి పిలిచినట్లుగా చెప్పారు.

టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మధ్య ఎలాంటి గ్యాప్ లేదన్నారు. ఇవాళ్టి లంచ్‌కు ఆయనకు కూడా అహ్వనం ఇచ్చామ‌ని రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండడం వల్ల ఇవాళ తాను నిర్వహించిన సమావేశానికి రావడం లేదన్నారు.

మరోవైపు.. విష్ణువర్ధన్​రెడ్డి పార్టీని వీడుతున్నట్టు వస్తున్న వార్త‌ల‌పై స్పందిస్తూ..కాంగ్రెస్ పార్టీకి తాము పట్టాదారులమని విస్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. తాను టీఆర్ఎస్, బీజేపీలో చేరే ప్రసక్తే లేదన్నారు. తాను చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఆయన చెప్పారు.

కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ తమకు బాస్‌ అని ఆయన చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉంటున్నానని చెప్పారు. పీజేఆర్‌ పేరు వాడుకొని కొందరు రాజకీయం చేయాలనుకుంటున్నారన్నారు.

 పీజేఆర్ అంటే ఒక చరిత్ర అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుంచే చేస్తానన్నారు. పీజేఆర్ రాజకీయ వారసులు ఆయనతో నడిచిన కార్యకర్తలేనని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.

తన సోదరి కాంగ్రెస్‌ పార్టీలో చేరే విషయమై పార్టీ నేతలు ఎవరూ కూడా తనతో చర్చించలేదన్నారు. తన సోదరి విషయంలో పార్టీ కార్యకర్తలు ఎలా చెబితే అలా చేస్తానని ఆయన తేల్చి చెప్పారు. 

Related posts