telugu navyamedia
సినిమా వార్తలు

“ది లయన్ కింగ్” తెలుగు ట్రైలర్

The-Lion-King

గతంలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న యానిమేషన్ మూవీ “ద లయన్ కింగ్”. డిస్ని సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా అన్ని భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నారు. అందుకే డిస్నీ సంస్థ “లయన్‌ కింగ్‌” సినిమా కోసం తెలుగులో ప్రముఖ నటీనటులతో జంతువులకు డబ్బింగ్‌ చెప్పించింది. “లయన్‌ కింగ్‌”లో సింహం పేరు సింబా. అలాగే స్కార్‌, ముఫాసా అనే రెండు సింహాలు, పుంబా అనే అడవి పంది, టీమోన్‌ అనే ముంగిస ఈ చిత్రంలో మిగిలిన కీలక పాత్రలు. స్కార్‌ అనే సింహానికి జగపతిబాబు డబ్బింగ్‌ చెప్పగా… హీరో సింబా తండ్రి ముఫాసా పాత్రకు రవిశంకర్‌ డబ్బింగ్‌ చెప్పారు. సినిమాలో టిమోన్ పాత్రకు అలీ – పుంబా పాత్రకు బ్రహ్మానందం డబ్బింగ్ చెప్పేశారు. కార్టూన్‌ నెట్‌వర్క్‌లో కామిక్‌ సీరియల్‌గా మొదలైన “లయన్‌ కింగ్‌”ను ఆ తరువాత డిస్నీ సంస్థ 2డి యానిమేషన్‌ ఫిల్మ్‌గా 1990లో విడుదల చేశారు. అప్పట్లో సూపర్‌హిట్‌ అయిన ఆ చిత్రాన్ని ఇప్పుడు 3డి యానిమేషన్‌ టెక్నాలజీతో, కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ ఉపయోగించి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ముఖ్య భాషల్లో వచ్చే నెల 19న “లయన్‌కింగ్‌” చిత్రం విడుదలవుతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రబృందం. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts