telugu navyamedia
సినిమా వార్తలు

వాట్ ఏ టాలెంట్ ? : సీతా పాపకు మహేష్ ప్రశంసలు

Mahesh-babu-with-sitara

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం “మహర్షి” సినిమాతో బిజీగా ఉన్నారు. ఆయన తాజాగా తన కూతురు తనను ఏ విధంగా మురిపించిందో తెలియజేస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్వయంగా మహేష్ బాబే “వాట్ ఏ టాలెంట్…” అనే కామెంట్ తో నా సీతా పాప అనే హ్యాష్ ట్యాగ్ జోడించి సితార డ్యాన్స్ చేసిన వీడియోను షేర్ చేయడం విశేషం. ఇంకో విశేషం ఏమిటంటే సితార డ్యాన్స్ చేసిన సాంగ్ “బాహుబలి-2” చిత్రంలోనిది కావడం. అందులో “మురిపాలా ముకుందా…” అనే పాటకు చక్కని అభినయంతో, పాటను పాడుతూ… సితార వేసిన స్టెప్స్ మహేష్ అభిమానులను కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోలో సితార డ్యాన్స్ చూసిన వారంతా క్లాప్ కొడుతున్న ఎమోజీలతో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.

Related posts