telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రవితేజ అభిమానులకు దీపావళి సర్ప్రైజ్… 66వ సినిమాపై అఫిషియల్ ప్రకటన

RT66

మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ స్పీడ్ పెంచాడు. ప్ర‌స్తుతం వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో డిస్కోరాజా అనే సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, న‌బా నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రిస్మ‌స్ కానుక‌గా చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు. అయితే దీపావ‌ళి సంద‌ర్భంగా ర‌వితేజ త‌న అభిమానుల‌కి స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్నాడు. రవితేజ 66వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఠాగూర్‌ మధు నిర్మిస్తున్నారు. గతంలో రవితేజ హీరోగా డాన్‌ శీను, బలుపు లాంటి సూపర్‌ హిట్ సినిమాలను అందించిన దర్శకుడు గోపిచంద్‌ మలినేని ఈ సినిమాతో రవితేజతో కలిసి హ్యాట్రిక్‌ సక్సెస్‌ అందించేందుకు రెడీ అవుతున్నాడు. పండగ చేస్కో, విన్నర్‌ సినిమాలతో నిరాశపరిచిన గోపిచంద్‌, రవితేజతో కలిసి హిట్ ట్రాక్‌లోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం గోపిచంద్‌ మలినేని ఈ సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. రవితేజ కోసం పవర్‌ఫుల్‌ పోలీస్‌ కథను సిద్ధం చేస్తున్నాడు గోపిచంద్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్‌ సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. నవంబర్‌లో సినిమా షూటింగ్ ప్రారంభించే ప్లాన్‌లో ఉన్నారు చిత్రయూనిట్. దీపావళి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్ ఇచ్చారు చిత్రయూనిట్. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటిస్తామని చెప్పారు.

Related posts