‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన సినిమా ‘రెడ్’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రామ్ సరసన నివేతా పెతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. స్రవంతి రవికిషోర్ సినిమాని నిర్మిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రామ్ రెండు విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు. ఏప్రిల్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే… ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూ ట్యూబ్‌లో ట్రెడింగ్ -1లో ఉంది. అంతేకాదు…. ఈ మూవీ ట్రైలర్ 6.5 మిలియన్స్ వ్యూస్, రెండు లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది. ఇక సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి. కాగా.. ఇస్మార్ట్ శంకర్’తో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం తీసుకొచ్చిన రామ్, సంక్రాంతి పండక్కి ‘రెడ్’తో థియేటర్లలోకి రానున్నారు.
previous post
next post