జగన్ ప్రభుత్వంపై టిడిపి లీడర్ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వంలో అవినీతి తాండవం చేస్తోంది. ఇసుక, మట్టి మొదలుకుని ఎర్రచందనం వరకు అన్నిటినీ వైసీపీ నేతలు దోచుకుంటున్నారని నిప్పులు చెరిగారు లోకేష్. “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాలు అని చెబుతూ ప్రజల కళ్ళుగప్పి మాయ చేస్తోంటే… ఇదే అదనుగా వైసీపీ నేతలు ఇసుక, మట్టి మొదలుకుని ఎర్రచందనం వరకు కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్టు దోచుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా అలెగ్జాండరైట్ రంగురాళ్ల అక్రమ తవ్వకం బయటపడింది.విశాఖజిల్లా, గొలుగొండ మండలంలో నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు అత్యంత విలువైన అలెగ్జాండరైట్ రంగురాళ్ల కోసం సాలికమల్లవరం రిజర్వ్ ఫారెస్ట్ లో జేసీబీలను పట్టుకుని వెళ్ళి మరీ యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. అటవీ సిబ్బందిని కూడా బెదిరిస్తున్నారంటే ఎంత బరి తెగింపో చూడండి! ఇంకా క్రూరంగా వైసీపీ నేతలు వాళ్ళ స్వార్థం కోసం చిన్నారులతో అడవుల్లో ప్రమాదకరమైన సొరంగాలు తవ్వి స్తున్నారు. ఆ పిల్లలకు ఏమైనా జరిగితే బాద్యులెవరు? ఒకవైపు అక్రమ తవ్వకం, మరోవైపు మైనర్ల ప్రాణాలతో చెలగాటం..ఈ నేరాలకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారు? పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు?” అంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
“త్రిష వీడియో బయటపెడతా…” హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు