ఈ మధ్య తన ట్యూన్స్‌ను వాడుకుంటున్న యువ సంగీత దర్శకుల గురించి దురుసుగా మాట్లాడి వార్తల్లో నిలిచారు ఇళయరాజా. తాజాగా మరోసారి ఈయన దురుసు ప్రవర్తనతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఇళయరాజా 76వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా సంగీత కచేరి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జేసుదాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో స్టేజ్‌పై ఉన్న ఒకరు దాహంగా ఉందని అనడంతో ఓ సెక్యూరిటీ గార్డు వాటర్ బాటిల్‌ను తీసుకొచ్చారు. అతన్ని గమనించిన ఇళయరాజా కచేరి జరుగుతుండగా మధ్య మధ్యలో ఎందుకు అలా ఇలా తిరుగుతున్నావు? అని ఆ వ్యక్తిని తిట్టారు. దాంతో సదరు సెక్యూరిటీ గార్డు ఇళయరాజా కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పారు. అలాగే 500, 1000 రూపాయల టికెట్ కొన్న కొందరు 10వేల రూపాయలు టికెట్ వారి వరుసలో కూర్చున్నారంటూ విమర్శలు చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.