telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మూతపడిన పూరీ నిర్మాణ సంస్థ… కరోనా ఎఫెక్ట్ ..!!

Puri

కరోనా వైరస్ దెబ్బకు థియేటర్లు మూతపడ్డాయి, షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. అటు వైపు రాష్ట్ర ప్రభుత్వం సైతం 15 రోజులు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పూరీ కనెక్ట్స్‌ #CoronavirusOutbreak అంటూ.. అడ్మినిస్ట్రేషన్‌, ప్రొడక్షన్‌ వర్క్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు మంగళవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తమ సిబ్బంది, నటీనటుల భద్రత దృష్ట్యా కలిసికట్టుగా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటన చేసింది. కరోనాపై యుద్ధంలో గెలవాలంటే సమిష్టిగా పోరాడదామని పూరీ, చార్మీ పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు నెలకొల్పుతున్న కరోనా వైరస్‌పై ప్రభుత్వ సూచనలను పాటించాలని, తగిన జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా ప్రజలకు సూచన చేశాసూచించారు. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా ‘ఫైటర్’ చిత్రాన్ని పాన్ ఇండియా ఫిల్మ్‌గా తెరకెక్కిస్తున్నారు పూరి, చార్మీ. ఆకాష్ పూరి, కేతికా శర్మ జంటగా అనిల్ పాదూరి దర్శకత్వంలో ‘రొమాంటిక్’ సినిమాను కూడా నిర్మిస్తున్నారు.

Related posts