మహేష్ 9.48 గంటల్లో వంద కిలోమీటర్లు పరుగెత్తి ఆశ్చర్యపరిచాడు. వచ్చే ఏడాది జనవరిలో ముంబయి వేదికగా జరగనున్న మారథాన్‌లో పాల్గొనేందుకు సన్నాహకంగా ఈ పరుగు తీశాడు. తన మిత్రులు ద్విచక్ర వాహనాలపై తోడు రాగా… గురువారం రాత్రి 11.30 గంటలకు బేస్తవారపేట బస్టాండు నుంచి పరుగు ప్రారంభించిన ఆయన తాటిచర్ల మోటు, కొమరోలు, ఎడమకల్లు, గిద్దలూరు, తురిమెళ్ల, కంభం మీదుగా శుక్రవారం ఉదయం 9.18 గంటలకు తిరిగి బేస్తవారపేటకు చేరుకున్నాడు.
9.48 గంటల్లోనే 100 కిలోమీటర్లు పరుగు పూర్తి చేసిన మహేష్‌ను స్థానికులు అభినందించారు. గతంలోనూ ఈ యువకుడు విజయవాడ, హైదరాబాద్, ముంబయి, విశాఖపట్నం, బెంగళూరు తదితర నగరాల్లో జరిగిన మారథాన్ పోటీల్లో పాల్గొన్నాడు. ముంబయి మారథాన్‌లో 42 కి.మీ. దూరాన్ని 2.11 గంటల్లో పూర్తి చేసి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే తన లక్ష్యమని మహేష్ పేర్కొన్నాడు. ప్రకాశం జిల్లా బేస్తవారపేట మండలం పాపాయిపల్లి మహేష్ స్వస్థలం. ఆణిముత్యాలన్నీ చిన్న గ్రామాల నుండి వస్తున్నవే, మీరు ఉత్సాహ పరచండి.. మెడల్ తెచ్చేస్తాడు!!
సాహసకృత్యాలు దేశాన్ని ముందుకు నడిపించలేవు: ప్రణబ్ ముఖర్జీ