telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఆకాశం లో సగం…

అనాది నుండి నీ కాళ్లకు బంధాలు
గడప దాటితే నీపై
అనుమానాలు
అవే నీ భయానికి హంసపాదు
అదే అవుతుంది నీకు
ముళ్లపాన్పు
నీవు చదివిన చదువులకు నీ మెడకు ఉరితాళ్ళు
అత్తింటి కి వెళ్లితే
అబండాలు
పుట్టింటికి వస్తే పోరాబాట్లు
మొగుడిచేతులో చావు దెబ్బలు
తెల్లవారితే నీ బ్రతుకు బజారుపాలు
ఎటు చూసినా నీకు ముళ్లపాన్పు లు
వీటినుండి నీకు విముక్తికి దారే లేదా?..
ఆకాశం లో సగమంటారు
భారత మాత నీవే నంటారు
సహనశీలి వంటారు
స్నేహశీలివంటారు
ప్రతి పురుషుడి ముందు నీవే
ప్రతి పురుషుడి విజయం వెనుక నీవే
కానీ !…
ఎన్ని యుగాలు దాటినా ఆలోచనలో
మార్పు రాని స్త్రీ జీవితం
క్షణకాలం నిర్వీర్యం
గడియకాలం నిర్భయమ్
నిమిషకాలం నిస్తేజం
గంటకాలం గతించిన కథనం
తల్లివై రక్తమాంసాలు పంచి పెచ్చెను
ప్రధమ గురువై సంఘ నడవడిక నేర్పేను
అమ్మంటే అమృతం
నాన్నంటే వేదం
వేదామృతల కలయికే
అమ్మ నాన్నలని తెలియజేసేను
కానీ!….
ఈ మానభంగ పర్వంలో (సమాజం)
కౌంతేయుల సభలలో( ప్రభుత్వాలలో)
మాదందాకారులు చేసే వికృత చేష్టలు ఇంకా రావణ కాష్టం లా మండుతూనే ఉన్నాయి.
మగువా!… ఓ మగువా!..
మరణాన్నే శాసించే నీకు మనుగడే కరువైందా?…
తల్లివై జన్మనిచ్చావు
అక్కవై ఓదార్చవు
చెల్లివై ప్రేమపంచావు
ఆలివై సేద తీర్చినావు
కానీ!…
ఈ మగ మృగ రాక్షసుల వికృత చేష్టలకు నీ మనుగడే
కరువైందా?…
ఓ మగువా….
మదమైక్కిన గజరాజును సైతం
చిన్న అంకుశంతో మధించవచ్చు
మదమైక్కిన
ఈ మగమృగ రాక్షసుల వికృత చేష్టలకు
శక్తివై ఆదిపరాశక్తివై
మరణ శాసనం లిఖించు
నీ మనుగడను శాసించు
ఆకాశమేంటి అంతటా నీవే నని చాటి చెప్పు
మగువా!…. ఓ మగువా!….
“మహిళామణులకు అంకితం”

Related posts