telugu navyamedia
సినిమా వార్తలు

ఎఫ్‌.ఎన్‌.సి.సిలో శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి

తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి గారికి ఈరోజు ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ గౌరవ సభ్యత్వం లభించింది .కల్చరల్ సెంటర్ అధ్యక్షులు జి .ఆదిశేషగిరి రావు, కార్యదర్శి కె .ఎస్ రామారావు గౌరవ సభ్యత్వ కార్డు ను అందించి సభాపతిని సత్కరించారు . కల్చరల్ సెంటర్ కు ఆదివారం ఉదయం 10. 30 గంటలకు పోచారం విచ్చేశారు . ఆయనకు కల్చరల్ సెంటర్ పాలక మండలి స్వాగతం చెప్పింది . ఆయనకు అధ్యక్షుడు కార్యదర్శి సభ్యత్వ కార్డును అందించారు .

తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీవాస రెడ్డి గారు మా కల్చరల్ సెంటర్ సభ్యుడు కావడం మా అందరికీ గర్వకారణమని, ఈ కల్చరల్ సెంటర్ లో ఎన్నో సౌకర్యాలున్నాయని , అప్పుడప్పుడు మా కల్చరల్ సెంటర్ కు రావాలని కార్యదర్శి రామారావు అన్నారు . అందుకు పోచారం తప్పకుండా వస్తాను అని చెప్పారు .

ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ గురించి విన్నాను. ఇది చాలా ప్రతిష్ఠాత్మకమైనదని , సభ్యుల కోసం ఎన్నో సౌకర్యాలున్నాయని మిత్రులు చెప్పారు . ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను . ఇలాంటి సెంటర్లో నాకు సభ్యత్వం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అని పోచారం చెప్పారు .

ఫిలిం నగరు కల్చరల్ సెంటర్ అంచెలంచెలుగా అభివృద్ధి చెందిందని, మొదట దీనికి పద్మశ్రీ డి .వి .ఎస్ .రాజుగారు అధ్యక్షులుగా వున్నారని, ఆ తరువాత డాక్టర్ కె .ఎల్ .నారాయణ , కె .ఎస్ .రామారావు అధ్యక్షులుగా ఎంతో అభివృద్ధి చేశారని , ప్రస్తుతం ఆదిశేషగిరిరావు గారు అధ్యక్షులుగా వున్నారని కాజా సూర్యనారాయణ వివరించారు .

డివిఎస్ రాజు గారిని ఎన్ .టి .రామారావు దగ్గర ఎన్నోసార్లు చూశానని , రామారావు గారికీ రాజు గారు ఎంతో సన్నిహితులని పోచారం గుర్తుచేసుకున్నారు . ఆ తరువాత జగపతి ,  రాజేంద్ర ప్రసాద్ గారు , నిర్మాత డి రామానాయుడు గురించి కూడా పోచారం గుర్తు చేసుకున్నారు . రాజేంద్ర ప్రసాద్ గారు చాలా మంచి సినిమాలు తీశారు .

గతంలో నేను ప్రకాశం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో వున్నప్పుడు రామానాయుడు గారు తనని కారం చేడు గ్రామానికి ఆహ్వానించారని . ఆ రాత్రి వారింట్లోనే చక్కటి భోజనం ఏర్పాటు చేశారని పోచారం తెలిపారు . ఆ తరువాత పోచారం శ్రీనివాసరెడ్డి గారికి తుమ్మల రంగారావు , కాజా సూర్యనారాయణ కల్చరల్ సెంటర్ ను చూపించారు.  సినిమావారి కోసం ఇంత మంచి సెంటర్ ను ఏర్పాటు చెయ్యడం తనకి ఆనందాన్ని కలిగించిదని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆదిశేషగిరిరావు , రామారావు , తుమ్మల రంగారావు ,కాజా సూర్యనారాయణ ,శివాజీ రాజా, శైలజ, సుష్మ, శివారెడ్డి ,ప్రతాప రెడ్డి , వేణు , ఏడిద రాజా, సీనియర్ జర్నలిస్ట్ భగీరథ , ప్రసాద్,బాలరాజు, భవాని తదితరులు పాల్గొన్నారు .

 

Related posts