2014లో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రగా తెరకెక్కింది పీకే. ఈ చిత్రంలో అనుష్క శర్మ హీరోయిన్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాను రాజ్‌కుమార్ హిరాని దర్శకత్వంలో విధు వినోద్ చోప్రా నిర్మించారు. ఈ సినిమా అందరినీ ఎంతగానో అలరిచింది. అయితే ఈ సినిమా క్లైమాక్స్ చూసినవారంతా ఈ సినిమా సీక్వెల్ వస్తుందని అనుకున్నారు. ఎందుకంటే క్లైమాక్స్ ఆమిర్ ఖాన్‌తో పాటు రణ్‌బీర్ కపూర్ మళ్లీ భూమి మీదకు వచ్చినట్లు ఉంది. కానీ ఇప్పటి వరకు ఈ విషయంపై ఎవ్వరు దృష్టి పెట్టలేదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విధు వినోద్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ‘ ఈ సినిమాకి సీక్వెల్ కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మేము సినిమాని అలానే ముగించాం. అయితే ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడు వచ్చుదో తెలీదు. పీకే2కి కథ సిద్దమయితే చేయడానికి మేము సిద్దం. కానీ రచయిత పీకే2ను రెడీ చేయలేదు. పీకే2 కావాలంటే రచయితని కథ రాయమని చెప్పండ’ని అన్నారు. దీనిని బట్టి చూస్తుంటే త్వరలో ఈ సినిమా సీక్వెల్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్ సినీ వర్గాలు అంటున్నాయి. ఇందులో మొదట చూపించిన విధంగానే రణ్‌బీర్ ప్రధాన పోషిస్తారంట. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది.
previous post
next post
చంద్రబాబుకు ఓటేస్తే..అన్నీ ప్రైవేట్ పరం: జగన్