telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

కిడ్నీలో స్టోన్ లా.. వీటితో చెక్..

tips to overcome stones in kidney

ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మంది కిడ్నీ స్టోన్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇప్పటిలో ఈ సమస్య చాలా మందికి యుక్త వ‌య‌స్సులో నే వ‌స్తున్నాయి. ఈ సమస్యకు అనేక కార‌ణాలు ఉంటాయి. కానీ కింద సూచించిన ప‌లు సూచ‌న‌లు పాటిస్తే కిడ్నీ స్టోన్లు రాకుండా చూసుకోవ‌చ్చు. ఈ సమస్య వ‌చ్చిన వారు ఈ సూచ‌న‌లు పాటిస్తే.. ఆ స్టోన్లు ప‌డిపోయేందుకు అవ‌కాశం ఉంటుంది. ఆ సూచ‌న‌లు…

* నిత్యం 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాలి. దీని వ‌ల్ల కిడ్నీల్లో ఉండే వ్య‌ర్థ ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. కిడ్నీ స్టోన్లు వ‌చ్చేందుకు అవ‌కాశం చాలా త‌క్కువ‌గా ఉంటుంది.

* నిత్యం తీసుకునే ఆహారంలో ఉప్పు త‌క్కువ‌గా ఉండేలా చూసుకోవాలి. అలాగే సోడియం ఎక్కువ‌గా ఉండే మ‌ట‌న్‌, ప్రాసెస్డ్ ఆహారాలు, నూడుల్స్‌, సాల్ట్ స్నాక్స్ తిన‌రాదు. వాటి వ‌ల్ల కిడ్నీ స్టోన్లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది.

* కాల్షియం ఉన్న ఆహారాల‌ను బాగా తీసుకుంటే కిడ్నీ స్టోన్లు వ‌స్తాయ‌ని చాలా మంది భావిస్తారు. కానీ అది ఎంత మాత్రం నిజం కాదు. నిజానికి కాల్షియం ఉన్న ఆహారాల‌ను బాగా తినాలి. దీని వ‌ల్ల కిడ్నీ స్టోన్లు రాకుండా చూసుకోవ‌చ్చు.

* పాల‌కూర‌, స్ట్రాబెర్రీలు, న‌ట్స్‌, టీ త‌దిత‌రాల్లో ఆగ్జాలిక్ యాసిడ్లు లేదా ఆగ్జ‌లేట్స్ ఎక్కువ‌గా ఉంటాయి. అందువ‌ల్ల ఈ ఆహారాల‌ను మానేయాలి. లేదంటే ఆగ్జ‌లేట్ స్టోన్లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది.

* విట‌మిన్ సి ఆహార ప‌దార్థాల‌ను నిత్యం మోతాదుకు మించి తీసుకోరాదు. తీసుకుంటే ఆగ్జ‌లేట్ స్టోన్స్ ఏర్ప‌డ‌తాయి.

* చ‌క్కెర‌, చ‌క్కెర‌తో త‌యారు చేయ‌బ‌డే ప‌దార్థాలు, కోడిగుడ్లు, చేప‌లు త‌దిత‌ర ఆహార ప‌దార్థాల‌తో స్టోన్లు ఏర్ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక ఈ ప‌దార్థాల‌ను మానేయాలి లేదా మితంగా తీసుకోవాలి. దీంతో కిడ్నీ స్టోన్లు ఏర్ప‌డ‌కుండా చూసుకోవ‌చ్చు.

Related posts