telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రఘురామకృష్ణరాజు ఫొటోకి చెప్పుల దండ..

వందేళ్ల చరిత్రతో.. లెక్కలేనన్ని ప్రదర్శనలతో ఒక తరాన్ని ఉర్రూతలూగించిన చింతామణి నాటకంలో వైశ్య కులానికి చెందిన వారిని అనుకరిస్తూ.. హేళన చేసేలా సుబ్బిశెట్టి పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాటక ప్రదర్శనలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

దీనిపై ఆర్యవైశ్య సంఘాలు హర్షం వ్యక్తం చేస్తే.. నాటక కళాకారుల సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. చింతామణి నాటకంపై వివాదం కొనసాగుతున్న సమయంలో రఘురామకృష్ణరాజు ప్రభుత్వ జీఓకి వ్యతిరేకంగా కోర్టులో పిల్ వేశారు.

అయితే ఈ వివాదం కొనసాగుతున్న సమయంలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రభుత్వ జీఓకి వ్యతిరేకంగా కోర్టులో పిల్ వేశారు. దీంతో ఆగ్రహించిన ఆర్యవైశ్య నాయకులు రఘురామకృష్ణ రాజు చిత్రపటానికి చెప్పుల దండ వేసి సత్కరించారు.

ఈ సందర్భంగా ఆర్యవైశ్య నాయకులు మాట్లాడుతూ.. రఘురామకృష్ణరాజు ఆర్యవైశ్యులతో పెట్టుకున్నారని.. ఇలాంటి వ్యక్తికి ఇలానే గుణపాఠం రఘురామకృష్ణ చిత్రపటానికి చెప్పుల దండ వేసి నిరసన చేపట్టారు.

Related posts