telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మ‌హిళా పోలీసుల‌కు పురుషులు కొల‌త‌లు..

రాష్ట్రంలో  నెల్లూరులో మహిళా కానిస్టేబుళ్ల యూనిఫామ్‌ కోసం మగటైలర్లు కొలతలు తీసుకోవడం పెద్ద దుమారం రేపుతోంది. పోలీసు యూనిఫామ్ కొలతలు పురుషులు తీసుకుంటుండంపై మహిళా పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు, కావలి డివిజన్ పరిధిలోని మహిళా పోలీస్‌ల నుంచి కొలతలు తీసుకున్నారు. అయితే మహిళలు చేయాల్సిన పనిని ఇద్దరు పురుషులకు అప్పగించారు. పురుషులు కొలతలు తీసుకోవడం ఏంటని చాలా మంది అయిష్టంగానే దీనికి ఒప్పుకున్నారు.

మహిళా పోలీసులకు అసౌకర్యం కలిగించేలా జెంట్స్ టెయిలర్స్ కొలతలు తీసుకుంటున్న ఫోటోలు బయటకు రావడంతో తీవ్ర వివాదం మొదలయ్యింది. మహిళల ఆత్మగౌరవానికి ఇది భంగం కలిగించేలా వుందంటూ మహిళా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదంగా మరింత ముదిరింది.

దీంతో స్పందించిన నెల్లూరు ఎస్.పి.విజయా రావు ..మహిళా పోలీసులకు సంబంధించి యూనిఫామ్ బాధ్యతలను టైలర్ మెజర్ మెంట్స్ తీసుకునే ఇంచార్జ్ గా ఉన్న హెడ్ కానిస్టేబుల్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఒక మీడియా ఫోటోగ్రాఫర్ నిబంధనలకు విరుద్దంగా ప్రాంగణంలోకి ప్రవేశించి ఫోటోలు తీశారన్నారు.

అంతేకాకుండా అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) వెంకటరత్నం ఆధ్వర్యంలో ఉమెన్ టైలర్స్, ఇతర మహిళా సిబ్బంది సహాయంతో మహిళా పోలీసుల కొలతలను తీసుకునే ఏర్పాటు చేసారు.

ఈ ప్రక్రియకు ఏ.ఎస్.పి వెంకటరత్నమ్మ ఇంచార్జి గా ఉన్నారని.. మహిళా పోలీసుల దుస్తుల కొలతలు తీసేందుకు మహిళలనే నియమించామని నెల్లూరు ఎస్.పి.విజయా రావు స్పష్టం చేశారు.

మహిళా పోలీసుల యూనిఫాం కొలతలు పురుషులు తీసుకుంటున్నట్లు తెలుసుకున్న వెంటనే జిల్లా ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను సమీక్షించారు.

Related posts