telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నన్ను “గోల్డ్ గిగ్గర్” అని పిలిచేవారు : కంగనా రనౌత్

Kangana

బాలీవుడ్ క్వీన్ కంగనా మరోసారి సంచలన కామెంట్లు చేసింది. తనను పరిశ్రమలో గోల్డ్ గిగ్గర్ (డబ్బుల కోసం పురుషులతో సన్నిహితంగా ఉండటం) అని పిలిచేవాళ్ళని ఆవేదన వ్యక్తం చేసింది. అలాంటివారికి ఏమని సమాధానం ఇవ్వాలో అర్థం కాకపోయేదని తెలిపింది. దాంతో 50 ఏళ్ళు వచ్చేసరికి దేశంలోని ధనవంతుల జాబితాలో ఉండాలని నిశ్చయించుకున్నట్టు తెలిపింది. తాను మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చానని దాంతో అవార్డ్స్ ఫంక్షన్స్ కు వెళ్ళడానికి బట్టలకు డబ్బులు కూడా ఉండేవికాదని చెప్పుకొచ్చింది. ఇక బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు కారణం నెపోటిజమే అంటూ నెటిజన్లు నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నటి కంగనా రనౌత్ కూడా సుశాంత్ మరణానికి కారణం పరిశ్రమలోని పెద్దలే అంటూ మండిపడ్డారు. దాంతో సుశాంత్ అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్ క్వీన్ అంటూ మెచ్చుకున్నారు.

Related posts