telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఆ హీరోయిన్ ప్రియుడిని మరిచిపోలేకపోతుందా..?

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తెలుగు,తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ కొనసాగుతుంది. కానీ ఒక విదేశీయుడుతో ప్రేమలో పడడం, తరువాత వీరి మధ్య మనస్పర్థలు రావడంతో బ్రేకప్ అయిపోయారు. శృతి తన బాయ్ ఫ్రెండ్ జ్ఞాపకాల నుండీ బయటకి రాలేకపోతుందని ఇటీవల కామెంట్స్ వినిపిస్తున్నాయి. విషయం ఏంటంటే.. ఆమె బాయ్ ఫ్రెండ్ ది లండన్ అన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఈమె లండన్ లో దిగిన ఓ ఫొటోను షేర్ చేసింది . “ఐ మిస్ లండన్” అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.అక్కడితో అయిపోలేదు… లండన్ లోని ‘బోన్ డాడీస్’ అనే రెస్టారెంట్ అంటే ఈమెకు చాలా ఇష్టమని..దానిని కూడా మిస్ అవుతున్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దీన్నిబట్టి చూస్తే ఆమె ఇంకా తన లండన్ జ్ఞాపకాలలో నుంచి బయటికి రాలేదని అర్ధమవుతుంది. ఇక ఈ ముద్దు గుమ్మ తిరిగి సినిమాలతో బిజీ అయిపోయింది. ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజతో  ‘క్రాక్’ లో నటిస్తుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం

Related posts