telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బామ్మరిది బ్యాచ్‌కి హాయ్…” అనుపమ పోస్ట్ వైరల్

Anupama

కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 6.4 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. వీరిలో తెలుగు, తమిళం, మలయాళం ఫ్యాన్స్ ఉన్నారు. అనుపమా పరమేశ్వరన్ తమ్ముడు అక్షయ్ పరమేశ్వరన్ పుట్టినరోజు నేడు. తన తమ్ముడు పుట్టినరోజును పురష్కరించుకుని అతనికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అనుపమ శుభాకాంక్షలు తెలిపింది. ‘‘హ్యాపీ బర్త్‌డే మంకీ. నువ్వు ఇప్పుడు పెద్దవాడివి అయిపోయావని నాకు తెలుసు. కానీ, నా పట్ల నీకున్న ప్రేమ మాత్రం తగ్గదు మిస్టర్ బ్రదర్’’ అని అనుపమ పేర్కొంది. అంతటితో ఆగకుండా ‘‘బామ్మరిది బ్యాచ్‌కి హాయ్’’ అని తన వీరాభిమానులను ఉద్దేశించి కామెంట్ చేసింది. అంటే, గతంలో అనుపమా పరమేశ్వరన్ తన తమ్ముడు ఫొటోలను షేర్ చేసినప్పుడు చాలా మంది ‘హాయ్ బామ్మరిది’ అని కామెంట్లు చేశారు. దీంతో ఇప్పుడు అలాంటి వాళ్లకు అనుపమ ఒక బిస్కెట్ వేసింది. దీంతో ‘హ్యాపీ బర్త్‌డే రా బామ్మరిది’ అంటూ కామెంట్ల మీద కామెంట్లు పెట్టారు. ఈ పోస్ట్‌ను ఇప్పటి వరకు 4 లక్షలకు పైగా మంది లైక్ చేశారు. ఇదిలా ఉంటే, అనుపమా పరమేశ్వరన్ చివరిగా ‘రాక్షసుడు’ సినిమాలో హీరోయిన్‌గా కనిపించింది. ఆ తరవాత మరే తెలుగు సినిమాలో ఆమె నటించలేదు.

Related posts