telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఆ హీరోతో చేయడానికి నో చెప్పిన కియారా…?

టాలీవుడ్ యంగ్ హీరోల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఒకరు. అల్లుడు శ్రీను సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన శ్రీనివాస్ ఆ తరువాత వైవిధ్యమైన కథలతో అలరించారు. అయితే తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసేందుకు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే రెబల్ స్టార్ ప్రబాస్ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను బెల్లంకొండ హీరోగా వీవీ వినాయక్ హిందీలో రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని హిందీలో పెన్ స్టూడియోస్ వారు నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాలో చేసేందుకు బీటౌన్ బ్యూటీలు ముందుకు రావట్లేదని సమాచారం. అంతేకాకుండా మూవీ మేకర్స్ బాలీవుడ్ భామలు కియారా అద్వానీ, అనన్య పాండే, దిశా పటానీ, శ్రద్దా కపూర్ తదితరులను సంప్రదించినప్పటికీ ఎవరూ ఆసక్తి చూపలేదని టాక్ నడుస్తోంది. మరి ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు చేస్తారు.. బెల్లంకొండతో నటించడానికి ఎవరు ఒప్పుకుంటారు అనేది చూడాలి.

Related posts