telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పెండింగ్‌లో ఉన్న రిజిస్ర్టేషన్లను వేగవంతంగా పూర్తి చేస్తాం..

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ర్టేషన్లపై చర్చించేందుకు సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు మహముద్ అలీ, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. అత్యంత సులువైన రిజిస్ర్టేషన్ల ప్రక్రియ కోసం పలు అంశాలపై చర్చించామన్నారు. క్రయ విక్రయాలు పారదర్శకంగా జరగాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతమని స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్‌కు ఎలాంటి ఆటంకాలు కలగరాదని సీఎం స్పష్టం చేశారని తెలిపారు. ప్రారంభ సమస్యలు ఉన్నా రిజిస్ర్టేషన్లు పుంజుకుంటున్నాయి.సమస్యలను అధిగమించి ప్రక్రియ సులువుగా జరిగేలా చేస్తామన్నారు. రద్దీ ఆధారంగా రిజిస్ర్టేషన్ల కార్యాలయాలను నాలుగు విభాగాలుగా చేశామన్నారు. రద్దీ ఉన్న కార్యాలయాలకు ఎక్కువ మంది రిజిస్ర్టార్లు, సిబ్బందిని నియమిస్తామని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న రిజిస్ర్టేషన్లను వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. మార్చి వరకు ఎలాంటి పెండింగ్ కేసులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రిజిస్ర్టేషన్లకు సంబంధించి అన్ని వర్గాల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించాం.. వారం రోజుల్లో అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. రిజిస్ర్టేషన్లపై బ్యాంకులకు ఉన్న అపోహలను తొలగిస్తాం అని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Related posts