telugu navyamedia
సినిమా వార్తలు

బీర్లు తాగిందని హీరోయిన్ ను సినిమా నుంచి తొలగించారట

Radhika-Apte

ప్రముఖ హీరోయిన్ రాధికా ఆప్టే బోల్డ్ కామెంట్స్ తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. లెజెండ్, రక్తచరిత్ర లాంటి చిత్రాలతో రాధికా ఆప్టే తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా రాధికా ఆప్టే ఓ ఇంటర్వ్యూలో “విక్కీ డోనర్” చిత్రం గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. “విక్కీ డోనర్ చిత్రంలో ముందుగా హీరోయిన్ గా నన్ను ఎంపిక చేశారు. సినిమా షూటింగ్ కు ఇంకా సమయం ఉండడంతో విహారయాత్రకు వెళ్ళా. అక్కడ బాగా తిని, బీర్లు ఎక్కువగా తాగి బరువు పెరిగిపోయా. షూటింగ్ ప్రారంభం అయ్యే సమయానికి నేను లావు ఎక్కువవడంతో సినిమా నుంచి నిర్మాతలు తొలగించారు. కాస్త సమయం ఇస్తే సన్నబడతానని రిక్వస్ట్ చేసినా వినలేదు. మంచి సినిమా కోల్పోయాననే లేదు… ఎందుకంటే అంతకు మించిన సినిమాలు వస్తాయి. కానీ బీర్లు తాగి లావయ్యాననే నెపంతో తొలగించడం చిర్రెత్తుకొచ్చింది. అప్పటి నుంచి తిండి విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నా” అని రాధికా ఆప్టే తెలిపింది. ఆయుష్మాన్ ఖురానా నటించిన విక్కీ డోనర్ చిత్రం బాలీవుడ్ లో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానాకు జోడిగా యామి గౌతమ్ నటించింది.

Related posts