మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’ . శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు రిలీజ్ డేట్ను ఖరారు చేసుకుంది. ఈ మూవీని వచ్చే ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్ల ప్రకటించింది చిత్రబృందం.
అందుకు సంబంధించిన ఓ కొత్త పోస్టర్ను రిలీజ్ చేసింది. ఇందులో లో రవితేజ యాక్షన్ మోడ్‌లో స్మార్ట్స్ గా కనిపిస్తున్నాడు. వెదురు కర్రను విసురుతూ ఫైటింగ్ కు వెళ్తున్నట్టుగా అన్పిస్తోంది. ఇక్కడ పోలీసులు, గ్రామస్తులు కూడా తమ చేతుల్లో కర్రలతో కనిపిస్తారు. ఈ పిక్ సినిమాలోని భారీ ఫైట్ సీక్వెన్స్‌లోనిది అని తెలుస్తోంది.
ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో దివ్యాంశ కౌషిక్ హీరోయిన్గా నటిస్తోంది. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు.