telugu navyamedia
రాజకీయ

నాగాలాండ్​ కాల్పులపై హోంమంత్రి వివ‌ర‌ణ‌..

లోక్​సభ లో నాగాలాండ్​ కాల్పుల ఘటనపై కీలక ప్రకటన చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. తిరుగుబాటుదారుల కదలికలపై సమాచారం అందుకున్న జవాన్లు ఆపరేషన్​ చేపట్టారని వివరించారు. ఈ క్రమంలోనే ఓ వాహనాన్ని అపినట్టు తెలిపారు.

21 కమాండోలు రంగంలోకి దిగి.. ఓ వాహనాన్ని ఆపాలని కమాండోలు కోరారు.అయితే వాహనంతో వారు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఉగ్రవాదులు ఉన్న వాహనం అన్న అనుమానంతో ఆర్మీ కాల్పులు జరిపారని స్పష్టం చేశారు.

Winter session LIVE: Amit Shah gives statement on Nagaland firing incident  in Lok Sabha

వాహనంలో ఉన్న 8 మందిలో ఆరుగురు మరణించారని , మరో ఇద్దరికి ఆర్మీ కమాండోలు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానికులు ఆర్మీ శిబిరాలను ధ్వంసం చేశారు. రెండు వాహనాలకు నిప్పంటించారు. జవాన్లపై దాడికి దిగ‌డంతో ఓ జవాను మరణించారు. పలువురు గాయపడ్డారు.

ప్రజలను చెదరగొట్టేందుకు.. భద్రతా దళాలు కాల్పులు జరపక తప్పలేదు. ఫలితంగా మరో ఏడుగురు పౌరులు మరణించారు. మరికొందరు గాయపడ్డారని తెలిపారు. స్థానిక పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు.

Related posts