telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్ 21 కోసం ఆయనకు భారీ పారితోషికం ?

Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ భారీ మూవీని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంపలు భాషలలో విడుదలకానుంది. ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం 2022 లో విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనె నటించడం విశేషం. దీపికా ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. అయితే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహ్మాన్ ని తీసుకోనున్నారట. దీనిపై వీరిమధ్య చర్చలు జరగడం, ఆయన ఓకే చేయడం కూడా జరిగిపోయిందని తెలుస్తుంది. ఇక ఈ మూవీ కోసం రెహ్మాన్ భారీగా డిమాండ్ చేశారని తెలుస్తుంది. అయినప్పటికీ చిత్ర యూనిట్ ఆయనపట్ల సుముఖంగా ఉన్నారట. ఇక ఈ చిత్రాన్ని అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు.

Related posts