telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దూకుడు పెంచిన బాలయ్య..

నందమూరి బాలకృష్ణ ఈ పేరుకే ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందనడంలో సందేహం లేదు. అతడి సినిమా అంటేనే బాక్సాఫీస్ బద్దలవుతుంది. నందమూరి నట సింహంతో చేసిన దర్శకులు అతనితో మళ్లీ చేయాలనుకోవడం ఆశ్యర్యం కాదు. దర్శకుడు హిట్ ఇచ్చినా ప్లాప్ ఇచ్చినా మళ్లీ అతనితో చేయడానికి బాలయ్య ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటాడు. అయితే ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో తన నూతన సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా వారి కాంబో వస్తున్న మూడో సినిమా. మొదట వచ్చిన రెండు సినిమాలు కూడా భారీ వసూళ్లను చేశాయి. ఇప్పుడు ఈ కాంబో మరో సినిమా చేయడంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. బోయపాటి, బాలయ్య కాంబో అంటే డాన్సులు, ఫైట్లు, పవర్ ఫుల్ డైలాగులతో ఉంటుంది. దాంతో వీరి మూడో సినిమాతో ఎలాంటి అద్భుతం సృష్టిస్తారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా బాలయ్యతో మరో సినిమా చేయాలని చూస్తున్నాడట. ఈ విషయం గురించి బాలయ్యను ఇదివరకే సంప్రదించాడట. వీరి కాంబోలో వచ్చిన పైసా వసూల్ ఎంత వసూల్ చేసిందని, ఏరేంజ్‌లో ఆడిందని ప్రత్యేకం చెప్పనక్కర్లేదు. దాంతో వీరి కాంబోలో మరో సినిమా వస్తుందని బాలయ్య అప్పట్లో చెప్పారు. దాంతో ఇప్పుడు పూరి మరో స్క్రిప్ట్ రెడీ చేశాడు. అయితే బాలయ్య తదుపరి సినిమాల గురించి నెట్టింట భారీ చర్చే జరుగుతోంది. బాలయ్య బోయపాటి సినిమా తరువాత పూరీ దర్శకత్వంలో ఆ తరువాత సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు సినిమాలతో హిట్‌లు ఇచ్చిన బీ గోపాల్‌తో ఓ సినిమా, డైలాగ్ రైటర్ సాయిమాధవ్, శ్రీనివాస్, కథలతో పాటు దర్శకుడు చంద్ర సిద్దార్థ సినిమాకి ఓకే చెప్పాడట. అంటే వరుస సినిమాలు చేస్తున్నాడని టాక్ నటడుస్తుంది. అయితే వీరిలో బోయపాటి తరువాత టోకెన్ ఎవరనేది ఆసక్తిని కలిగిస్తుంది. ఎందుకంటే బాలయ్య ప్రస్తుత యువహీరోలతో పాటు పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తూ అభిమానులను ఉర్రూతలూగాస్తున్నారు. మరి చూడాలి బోయపాటి తరువాత బాలయ్యకు బ్రేక్ ఇచ్చే దర్శకుడనేది వేచి చూడాలి.

Related posts