telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న అందాల భామ..!

అందగత్తెలను లేట్‌గా చూడటం దురదృష్టమనే చెప్పాలి. అలాంటి వారికి వచ్చచే ఏడాది అదృష్టం పట్టుకోనుంది. ఎందకనుకుంటున్నారా.. వచ్చే ఏడాది నజ్రియా నాజిమ్ తెలుగులో ఎంట్రీ ఇచ్చేస్తుంది. నాచురల్ స్టార్ నానీ కథానాయకుడిగా తెరకెక్కనున్న ‘అంటే సుందరానికి’ సినిమాలో నజ్రియా చేయనుంది. ఇప్పటి వరకు తమిళం, మలమాళం సినిమాల్లో చేసే కనపించిన నజ్రియా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేసేందుకు టాలీవుడ్‌లోకి రానుంది. నజ్రియా బాలనటిగా మలయాళ వెండి తెరకు పరిచయం అయింది. తరువాత కొంత గ్యాప్ తీసుకొని హీరోయిన్‌గా రీఎంట్రీ ఇచ్చింది. అప్పుడు ఆమెను చూసిన వారంతా నోరెళ్లబెట్టారు. ఇంత అందం ఇన్నాళ్లు ఏమైంది, ఎక్కడ ఉందని అన్నారు. అలా హీరోయిన్‌గా కొనసాగుతున్న నజ్రియా వివాహం కోసం మళ్లీ గ్యాప్ ఇచ్చింది. ఈమెకు 2014లో వివాహం అయింది. ఆ తరువాత ఇటీవల రీఎంట్రీ ఇచ్చింది. అప్పటికీ ఇప్పటికీ అదే గ్లామర్‌తో కుర్రకారుని కట్టిపడేస్తుంది. మరి అలాంటి సుందరి తెలుగులో ఎంట్రీ అంటే ఇక్కడ కుర్రకారు పరిస్థితి ఇంక అంతే సంగతులు. నజ్రియా అందానికి, నటనకు వంకపెట్టలేం. టాలీవుడ్‌పై ఈ అమ్మడు దృష్టిపెడితే అగ్ర హీరోయిన్‌లకు కూడా అతి తక్కువ టైంలోనే గట్టి పోటీ ఇస్తుంది. మరి నజ్రియా ఇక్కడికి కసితో అడుగుపెడుతుందో.. కాలక్షేపానికి అడుగుపెడుతుందో చూడాలి.

Related posts