telugu navyamedia
సినిమా వార్తలు

నేడు ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం..

మా ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న మంచు విష్ణు ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‎లో పదవి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

మా ఎన్నిక‌ల అధికారి కృష్ణ మోహ‌న్ విష్ణు చేత ప్ర‌మాణ‌స్వీకారం చేయించ‌నున్నారు. విష్ణుతో పాటు ప్యానెల్ స‌భ్యులు కూడా నేడు ప్ర‌మాణం చేయ‌నున్నారు. ఫిల్మ్ న‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్‌లో జ‌రిగే ఈ వేడుక‌కు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు పరుచూరి బ్రదర్స్, కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం‏ను కలిసి ప్రమాణా స్వీకార మహోత్సవానికి హాజ‌రు కానున్న‌ట్లు స‌మాచారం. ముఖ్యఅతిథిగా తెలంగాణ పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ఈ నెల 10న అత్యంత నాట‌కీయ ప‌రిణామాల మ‌ద్య మా ఎన్నిక‌ల్లో మంచు విష్ణు ప్ర‌కాశ్ రాజ్‌పై 107 ఓట్ల తేడాతో గెలుపొందిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (‘మా’ )అధ్యక్షుడిగా మంచు విష్ణు 13వ తేదీన‌ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన పెన్షన్ల ఫైల్ పై తొలి సంతకం చేసిన విష‌యం తెలిసిందే.

Related posts