telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రాబోతున్న అడవి శేష్

adavi-sesh

క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడి చేస్తుంటాడు అడవి శేష . ఈ తరహా సినిమాలకు అడవిశేష్ కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాడు. క్షణం, గూఢాచారి వంటి సినిమాల్ని తీసి నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఓ వైపు నటిస్తూ… మరో వైపు స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్క్రీప్ట్ విషయంలో కూడా తన సత్తా చాటుతున్నాడు అడవి శేష్. అయితే తాజగా అడవి శేష్ మరో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి రెడీ అవుతున్నాడు. గూఢాచారి 2ను త్వరలో తీసేందుకు అడవి శేష్ సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమా కథను కూడా అతడే రెడీ చేసినట్లు సమాచారం. తన స్నేహితుల సలహాలు సూచనలతో స్క్రిప్ట్ మొత్తం పూర్తయినట్లు తెలుస్తోంది. కథ కూడా బాగా కుదిరినట్లు టాక్. అడవి శేష్ నెక్ట్స్ ఫిల్మ్ కూడా గూఢాచారి 2 యేనని సమాచారం.

Related posts