telugu navyamedia
సినిమా వార్తలు

ప్రియాంక మైనపు విగ్రహం ప్రఖ్యాత లండన్ “మేడం టుస్సాడ్స్” లో…

Priyanka-Chopra

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా… నిక్ జోనాస్‌తో వివాహం త‌ర్వాత న్యూయార్క్‌లోనే ఎక్కువ‌గా ఉంటుంది. ప్రియాంక చోప్రాకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉందనే విషయం తెలిసిందే. ఆమె క్రేజ్ దృష్ట్యా మేడ‌మ్ టుస్సాడ్స్ ప్రియాంక చోప్రా మైన‌పు విగ్ర‌హాల‌ని న్యూయార్క్‌, సిడ్నీ, సింగ‌పూర్, బ్యాంకాక్‌, హాంగ్‌కాంగ్‌ల‌లో ఇప్పటికే ఉంచారు. ఇప్పుడు తాజాగా ప్రియాంక చోప్రా మైనపు విగ్రహం ప్రఖ్యాత లండన్ “మేడం టుస్సాడ్స్” మ్యూజియంలో ఆవిష్కరించారు. ఈ మేరకు మేడం టుస్సాడ్స్ బృందం త‌మ ట్విట్ట‌ర్‌లో వెల్‌క‌మ్ టూ లండ‌న్ అనే పోస్ట్ పెట్టింది. మేడ‌మ్ టుస్సాడ్స్ వారు కూడా న్యూ యార్క్ వెళ్లి ఆమె కొల‌త‌లు తీసుకున్నారు. 2018 నుండి ఈ వాక్స్ విగ్రహంకి సంబంధించిన ప‌నులు జ‌రుగుతున్నాయ‌ట‌. మంగ‌ళ‌వారం లండ‌న్‌లో ప్రియాంక మైన‌పు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించగా, ఆ విగ్ర‌హం 2017లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకల్లో బంగారు వన్నెతో ఉండే లాంగ్ గౌన్ డ్రెస్ ధ‌రించిన ప్రియాంకలా ఉంది. ప్రియాంక త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో వాక్స్ స్టాచ్యూకి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ.. టుస్సాడ్స్ బృదంతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది, నాకు వారిచ్చిన ఈ గౌరవానికి ధన్యవాదాలు అని తెలిపారు.

Related posts