telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విడాకుల వార్తలపై ఎట్టకేలకు స్పందించిన కలర్స్ స్వాతి

swati

కొంతకాలం క్రితం పైలెట్ వికాస్ వాసును వివాహం చేసుకున్న ‘కలర్స్’ స్వాతి ఓ ఇంటిది అయిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ లోపే కలర్స్ స్వాతి విడాకులు తీసుకుంటుందన్న వార్తలు ఒక్కసారిగా గుప్పు మన్నాయి. వికాస్ నుంచి కలర్స్ స్వాతి విడిపోతుందని గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు. స్వాతి తన భర్తతో కలిసి దిగిన ఫోటోల్ని ఇన్‌స్టాగ్రామ్ నుంచి తీసేసింది. గతంలో బాయ్ ఫ్రెండ్స్‌తో బ్రేకప్ అయిన ఇలియానా, సనా ఖాన్ హీరోయిన్స్ కూడా ప్రియుడి నుంచి విడిపోయిన తరువాత, వారితో కలిసున్నప్పుడు దిగిన ఫోటోలను తమతమ సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించారు. తాజాగా స్వాతి సైతం వికాస్ తో కలిసున్న ఫోటోల్ని తీసేయడంతో అంతా స్వాతి వికాస్‌ విడిపోతున్నారన్న పుకార్లు పుట్టించారు. తాజాగా ఈ వార్తలపై స్వాతి స్పందించింది. దీనిపై వివరణ ఇస్తూ ఇన్ స్టాగ్రామ్‌లో ఓ వీడియో కూడా పోస్టు చేసింది. భర్తతో కలిసి దిగిన చిత్రాలను ఆర్కివ్స్ లో దాచుకున్నానని చెబుతూ, తన స్మార్ట్ ఫోన్ లోని వాటిని చూపించింది. అంతేకాదు వాటిన్నంటిని ఓ చిన్న వీడియోను తీసి, దాన్ని పోస్ట్ చేసింది. దీంతో స్వాతి విడాకుల పుకార్లను కొట్టిపారేసినట్లయింది.

Related posts