telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

టిక్ టాక్ పై అమెరికా నిషేధం

Tik-Tok

టిక్ టాక్ విషయంలో ముందు నుంచి అనుకున్నట్లే జరిగింది. సోష‌ల్ మీడియా యాప్ టిక్‌టాక్‌పై అమెరికా నిషేధం విధించనున్న‌ట్లు అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించారు. అమెరికా ప్ర‌జ‌ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని చైనా ఇంటెలిజెన్స్ ఉప‌యోగించుకుంటున్న‌ద‌ని అధికారులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నార‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో టిక్‌టాక్ వ్య‌వ‌హారాన్ని ఆయన ప‌రిశీలిస్తున్నామ‌ని చెప్పారు. ఎయిర్ ఫోర్స్ వ‌న్‌లో విలేక‌రుల‌తో ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు అమెరికా నుంచి టిక్ టాక్ ను బ‌హిష్క‌రిస్తున్నామ‌ని ప్రకటించారు. 
అమెరికా ప్ర‌జ‌ల స‌మాచార గోప్య‌త‌పై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతుండ‌టంతో టిక్‌టాక్‌పై నిషేధం విధించే అంశాన్ని ప్ర‌భుత్వం ప‌రిశీలిస్తున్న‌ద‌ని గతంలోనూ ట్రంప్ ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. గాల్వన్ లోయలో భారత సైనికులపై చైనా సైన్యం దాడికి దిగినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య దూరం పెరిగింది. టిక్ టాక్ సహా 250కి పైగా యాప్స్ పై భారత్ నిషేధం విధించింది. అప్పటి నుంచి అమెరికా కూడా టిక్ టాక్ పై నిషేధం విధించే అవకాశం ఉందని అందరూ భావిస్తూ వచ్చారు. ఇప్పుడు అనుకున్నట్లే అమెరికా నిర్ణయం తీసుకుంది.

Related posts