telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఆచార్య నుండి ”సిద్ధ” ఫస్ట్ లుక్ విడుదల…

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. దాదాపు 40నిమిషాల నిడివి ఉన్న పాత్రతో చెర్రీ అందరినీ ఆకట్టుకోనున్నారు. ఈ సినిమా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఎంతో ప్రతిస్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరు సరసన కాజల్ నటిస్తుండగా, చరణ్‌కు జోడీగా పూజా హెగ్దె నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణలో చిరు, చెర్రీ ఇద్దరూ పాల్గొంటున్నారు. అంతేకాకుండా ఈ మధ్యే భారీ యాక్షన్ షెడ్యూల్ తాజాగా ప్రారంభం అయిందంట. ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ పాత్రలో కనిపిచంనున్నారు. అయితే ఈరోజు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్బంగా… సిద్ధ పాత్ర యొక్క ఫస్ట్ లుక్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు చిరు. ఇందులో చిరు, చరణ్ ఇద్దరు నక్సల్స్ గెటప్ లో గనులు పట్టుకొని కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమా మే13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చూడాలి మరి ఆచార్య అభిమానులను అనుకున్నంత స్థాయిలో అలరిస్తారా లేదా అనేది.

Related posts