telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇంకోసారి జగన్ జోలికొస్తే … నాగబాబుకి శ్రీరెడ్డి వార్నింగ్

srireddy

బొమ్మ అదిరింది కామెడీ షోలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని హేళన చేస్తూ కమెడియన్లు రియాజ్, హరి‌లు  స్కిట్ చేయడంతో జగన్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. ఇక ఆ షోకి యాంకర్‌గా ఉన్న శ్రీముఖిని, జడ్జీగా ఉన్న నాగబాబుని బండబూతులు తిడుతూ ట్రోల్ చేశారు. అయితే ఈ వివాదంలో రియాజ్, హరిలు క్షమాపణలు తెలియజేస్తూ తప్పును ఒప్పుకున్నారు. అయితే నాగబాబు మాత్రం జగన్ ఫ్యాన్స్‌ని మరింత రెచ్చగొడుతూ ‘బొమ్మ అదిరింది’ అంటూ సింహాసనంపై కుక్కను కూర్చోబెట్టి ఫేస్ బుక్‌లో ఫొటో పెట్టడంతో ఈ అదిరింది వివాదం మరింత ముదిరింది. దీంతో వైసీపీ-జనసేనల మధ్య ట్వీట్లు, పోస్ట్‌ల వార్ నడుస్తోంది. ఈ తరుణంలో నాగబాబుని బండబూతులు తిడితూ వీడియో వదిలింది శ్రీరెడ్డి. ఇది స్నేక్ బాబుకి నా వార్నింగ్ అంటూ ఫేస్ బుక్‌లో వీడియో పెట్టింది. అవునురా స్నేక్ బాబూ.. కనకపు సింహాసనం మీద కుక్కను కూర్చోబెట్ట కూడదురా.. నీలాంటి వెధవలకు మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు జబర్దస్త్ అనే షోలో జడ్జీని చేసి కనకపు సింహాసనం ఇచ్చారు. ఆయన దగ్గర విశ్వాసంగా ఉండలేదు. నిన్ను సింహాసనం ఎక్కించిన శ్యామ్ ప్రసాద్ రెడ్డిని కాటేశావు.

మీ అన్నయ్యకు పిచ్చిపట్టి గుండు కొట్టించుకుని తిరుగుతున్నాడు. చార్టెడ్ ఫ్లైట్‌లు వేసుకుని జగన్ మోహన్ రెడ్డి గారిని కలుస్తూ ఉంటాడు. కానీ ఎస్పీ బాలు చనిపోతే చూడటానికి మాత్రం రారు. నువ్ కూసిన కూతలకి మీ తమ్ముడు మా పార్టీకి వాడికి సంబంధం లేదు అని పక్కన పెట్టాడు. నీకు ఎంపీ సీటు ఇచ్చినా గెలవలేక నీకు పిచ్చిపట్టింది.. నా ఛానల్ నా ఇష్టం అంటావు కాసేపు.. ఇక అదిరింది, బెదిరింది, కుదిరింది, పిచ్చి ముదిరింది అంటూ పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నావ్. ముందు పిల్ల పెళ్లి ఉంది ఆ ఏర్పాట్లు చూసుకో. అందరి చేతులో పడి దెబ్బలు తిన్నావ్ అనుకో.. అల్లుడు దగ్గర పరువు పోతుంది. నీకు ఏం చూసుకునిరా అంత బలుపు. నీ అబ్బసొత్తురా ఆంధ్ర.. అంతమంది ప్రజలు ఓట్లు వేసి జగన్‌ని సీఎంగా ఎన్నుకుంటే. జగన్ మోహన్ రెడ్డిగారు అంటే ఆటల్లా ఉందా మీకు. ముందు విగ్ తీసి మాట్లాడు ముసలి నక్క అంటూ రెచ్చిపోయింది శ్రీరెడ్డి. ఇది ఫైనల్ వార్నింగ్ బిడ్డా.. ఇంకోసారి జగన్ జోలికొస్తే ఎక్కడున్నావో వెతికిమరీ వచ్చి చెప్పుతీసుకుని కొడతా అంటూ మెగా బ్రదర్ నాగబాబుకి వార్నింగ్ ఇచ్చింది శ్రీరెడ్డి.

Related posts