కరోనా కారణంగా సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. హీరోయిన్స్ కొందరు వర్కవుట్స్ చేసుకుంటూ తమ బాడీని ఫిట్‌గా చేసుకుంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ఈ లాక్‌డౌన్ సమయాన్ని హీరోయిన్ నిధి అగర్వాల్ చాలా చక్కగా ఉపయోగించుకుంటుంది. అవును.. ఆన్‌లైన్‌లో న్యూయార్క్ అకాడమీ అందిస్తున్న కోర్సులను ఆమె నేర్చుకుంటుంది. ఆన్‌లైన్ ద్వారా పాఠాలు వింటూ ఒక నోట్ బుక్‌లో వాటిని నోట్ చేసుకుంటున్న నిధి అగర్వాల్ ఫొటోలు ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతున్నాయి. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన హిందీ సినిమా ‘మున్నామైఖెల్’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే అందాలు ఆరబోసి అదరగొట్టింది. ఆతరువాత ‘ఇస్మార్ట్ శంకర్’తో హిట్ కొట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది.
previous post