telugu navyamedia
సినిమా వార్తలు

సర్కారు వారి పాట’నుంచి క్రేజీ ఆప్డేట్‌..

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘సర్కారు వారి పాట’ . దర్శకుడు పరుశరామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Unique Record: Mahesh Babu's Sarkaru Vaari Paata All Songs Leaked?

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన కళావతి, పెన్నీ సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఇందులోని స్టెప్స్ కూడా వైరల్ అయి సినిమాకి మరింత హైప్ ని తీసుకొచ్చాయి. ఇటీవలే సర్కారు వారి పాట ట్రైలర్ రిలీజ్ అయి అందరి అంచనాలని పెంచేసింది.

Mahesh Babu Worried About A Single Poster Mahesh Babu Starrer Sarkaru Vaari Paata Trailer Will Be Released On 2nd May IG News - IG News

ఈ సినిమాలో మహేష్ వింటేజ్ లుక్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. ఇక ఈ చిత్రంలో మహేష్ ఒక మాస్ సాంగ్ లో ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టబోతున్నారని మేకర్స్ చెప్పినప్పటినుంచి ఈ సాంగ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ కాబోతుందా అని ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Sarkaru Vaari Paata:'Kalaavathi' song promo amplifies the buzz | Telugu Movie News - Times of India

తాజాగా చిత్ర బృందం ఈ పాటపై అప్డేట్ ఇచ్చింది. సర్కారు వారి పాట సినిమాలోంచి‘మా మా మహేషా..’అనే సాంగ్ ని రేపు శనివారం మే 7నతేదీన రిలీజ్ కానుంది అని అనౌన్స్ చేశారు . ఇక దీంతో పాటు మాస్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ లో మహేష్, కీర్తి సురేష్ కలర్ ఫుల్ డ్రెస్ లో ఒక మాస్ స్టెప్పు వేయబోతు కనిపించారు.

Sarkaru Vaari Paata Will Be A Big Event For Mahesh Babu Fans," Says Film's  Editor

ఇందులో మహేష్ ఊర మాస్ స్టెప్పులతో అడగొట్టాడని టాక్ వినిపిస్తోంది. కీర్తి సైతం మహేష్ కు ధీటుగానే స్టెప్పులతో అలరించిందని సమాచారం. ఈ సాంగ్ కు థియేటర్లో స్క్రీన్స్ చిరిగిపోతాయని అభిమానులు అశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related posts