రష్యాకు చెందిన ఓ తండ్రికి భయంకరమైన అనుభవం ఎదురైంది. వాషింగ్ మెషీన్ వైపు చూసిన అతనికి కుమారుడు చిరునవ్వులు చిందిస్తూ వాషింగ్ మెషీన్ లో… ఆ పిల్లాడిని కూడా దుస్తులు ఉతికినట్లు ఉతికేస్తుందా మెషీన్. దాన్ని చూసిన అతనికి పైప్రాణాలు పైనే పోయాయి. ఉన్నపళాన ముందుకు దూకి వాషింగ్ మెషీన్ ఆఫ్ చేసేశాడు. దాని తలుపులు తెరిచి తన కుమారుడి కోసం గాలించడం మొదలెట్టాడు. కానీ ఆ వాషింగ్ మెషీన్‌లో తన కుమారుడు లేడు. అసలు విషయం ఏంటంటే.. కారెన్ అనే ఆ వ్యక్తికి తన కుమారుడంటే పిచ్చి ప్రేమ. అందుకే తనకు ఎంతో నచ్చిన ఓ టీషర్ట్‌పై తన కొడుకు ఫొటోను ప్రింట్ చేయించుకున్నాడు. దాన్నే అతని భార్య వాషింగ్ మెషీన్‌లో వేసింది. అది తెలియని కారెన్ ఇంటికొచ్చేసరికి వాషింగ్ మెషీన్‌లో తన కుమారుడు పడిపోయాడని భయపడ్డాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇమ్‌గుర్‌లో పంచుకున్న ఆ తండ్రి.. ‘దేవుడా.. ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది’ అంటూ క్యాప్షన్ తగిలించాడు. దీన్ని చూసిన చాలామంది నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తే, కొందరు కారెన్‌కు సానుభూతి చూపించారు.
previous post