telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

కార్ యాక్సిడెంట్… యువతిపైకి ఎక్కిన కారు… కానీ…!

Accident

డ్రాగన్ కంట్రీ చైనా సోషల్ మీడియాలో ఓ మహిళ రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. స్కూటీపై వెళ్తున్న మహిళ రోడ్డు క్రాస్ చేసే సమయంలో ఒక కారు ఆమెను ఢీకొట్టింది. దాంతో ఆ మహిళ స్కూటీ మీద నుంచి రోడ్డుపై పడిపోయింది. గాయపడిన ఆమె రోడ్డు మీద నుంచి లేచే లోపు అటువైపు నుంచి వచ్చిన మరో కారు ఆమెపైకి ఎక్కేయడం వీడియోలో ఉంది. ఇది గమనించిన కొందరు కారు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో మహిళ ప్రాణాలతో బయటపడింది. తీవ్రంగా గాయపడిన మహిళను వెంటనే స్థానికులు చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ భయంకర ఘటన తూర్పు చైనాలోని అన్హుయి ప్రావిన్స్‌లో గల మన్షాన్ నగరంలో చోటుచేసుకుంది. ఇప్పుడీ ప్రమాదానికి సంబంధించిన వీడియో అక్కడి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related posts