telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

వాకింగ్ కు వెళ్ళి తప్పిపోయిన మహిళ… చివరకు ?

Australia

అక్టోబర్ 13వ తేదీన దక్షిణ ఆస్ట్రేలియాలోని ఓ రిమోట్ ప్రాంతంలో ఉన్న ఆలయానికి మహిళ వెళ్లింది. గుడికి వెళ్లిన అనంతరం అలా వాకింగ్‌కు వెళ్దామని బయలుదేరింది. కొద్ది దూరం వెళ్లాక తాను వచ్చిన మార్గాన్ని మరిచిపోయింది. చుట్టు పక్కల ప్రాంతాలు మొత్తం ఖాళీగానే ఉండటంతో మహిళకు ఏం చేయాలో తోచలేదు. మరోపక్క మహిళ కనిపించడం లేదంటూ ఆమె స్నేహితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌ను మొదలుపెట్టారు. హెలికాప్టర్‌తో గాలించినప్పటికీ.. మహిళ ఆచూకీ దొరకలేదు. ఆ పరిసర ప్రాంతాల్లో స్థలం కలిగి ఉన్న వ్యక్తి తన స్థలంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఓ చోట మట్టిపై ‘ఎస్‌ఓఎస్’ అని రాసి ఉండటం కనిపించింది. సహజంగా ఎమర్జెన్సీ సమయంలో ఎస్‌ఓఎస్‌ లెటర్లను వాడుతూ ఉంటారు. ఈ లెటర్లను చూసిన స్థల యజమాని.. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు ఆ స్థలానికి వెళ్లగా.. మహిళ అక్కడే ప్రాణాలతో కనిపించింది. తనకు తాగడానికి నీళ్లు మాత్రమే దొరికాయని, ఎలా అయినా బ్రతికి బయటపడాలనే సంకల్పంతో మూడు రోజులుగా ఉన్నానని మహిళ చెప్పుకొచ్చింది.

Related posts