telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సినిమాల నుంచి సైడ్ అయిన అనుష్క… కారణం ఇదే…?

Anushka-and-Virat

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఇటీవల కాలంలో సినిమాలను బాగా తగ్గించింది. షారూక్ ఖాన్‌తో నటించిన “జీరో” తర్వాత ఇప్పటివరకు అనుష్క మరో సినిమాకు ఓకే చెప్పలేదు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో వివాహానికి ముందు తన గ్లామరస్ ఫోటోలను, బికినీ ఫోటోలను రెగ్యులర్‌గా సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసేది. పెళ్ళి తరువాత కూడా బికినీ ధరించిన హాట్ ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే విరాట్‌ని పెళ్ళి చేసుకోగానే సినిమాలకు గుడ్‌బై చెప్పాలని అనుష్క ముందు అనుకున్నదట. కానీ తన నిర్ణయం వలన అభిమానులు నిరాశకు గురవుతారని భావించి, నెమ్మదిగా సినిమాలు తగ్గించుకుంటూ తెర వెనుకకు వెళ్ళాలని డిసైడ్‌ అయిందట. తన నిర్ణయాన్ని బహిర్గతం చేయకుండా ఏ సినిమాకు ఓకే చెప్పకుండా కాలం వెళ్ళదీస్తోంది. గతంలో ఒకేసారి మూడు నాలుగు సినిమాలకు ఓకే చెప్పిన అనుష్క ఇప్పుడు ఏడాదిగా ఒక్కటంటే ఒక్క సినిమాకూ ఓకే చెప్పలేదు. కారణం మంచి కథ దొరకలేదట. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లో మంచి మంచి సినిమాలు పదుల సంఖ్యలోనే వచ్చాయి. మంచి విజయం సాధించాయి. అలాంటివి అనుష్క కంట పడలేదా? లేదా పడినా లైట్‌ తీసుకుంటోందా? అన్నదే అభిమానుల సందేహం. ప్రస్తుతం సినిమాల కన్నా భర్తతో కలిసి మ్యాచ్‌లకు వెళ్ళడానికే ఎక్కువ ఆసక్తి చూపుతోందట. మొత్తానికి అనుష్క సైలెంట్‌గా సైడ్‌ అయ్యిందని అంటున్నారు

Related posts