telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో… తేలిన విషయాలు..

apcm and kcr meeting

మరోసారి తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ పై ఆసక్తి సంతరించుకుంది. ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. రాజకీయ కారణాలతో కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు చేయూత ఇవ్వడం లేదని, ఇరు రాష్ట్రాల సీఎంలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రాల బాగు కోసం తాము తీసుకునే నిర్ణయాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం పై కేసీఆర్, జగన్‌లు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. నరేంద్రమోదీని కలిసి ఈ అంశాలపై చర్చించాలనే ఇరువురు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆర్థిక మాంద్యం ప్రమాదకరంగా మారిందని, ఇప్పటికే పలు రంగాలపై ప్రభావం చూపుతోందని తెలంగాణ సీఎం తెలిపారు. జగన్ కూడా ఏపీలోని పరిస్థితులను వివరించారు.

రెండు రాష్ట్రాల శ్రేయస్సు కోసం గోదావరి-కృష్ణా నదులను అనుసంధానంపై కూడా సానుకూల వాతావరణం ఏర్పడినట్టు తెలుస్తుంది. గోదావరి నీటిని కృష్ణాకు ఎక్కడ నుంచి, ఎలా తరలించాలి, అలైన్ మెంట్ ఎలా ఉండాలి అనే దానిపై కొంత స్పష్టత వచ్చింది. దీంతోపాటు వివిధ అంశాలపై ఇద్దరు సీఎంలు 4 గంటల పాటు చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. విద్యుత్, పోలీస్ ఉద్యోగులకు సంబంధించి సమస్యల పరిష్కారానికి ఇరువురు అంగీకరించారు. వచ్చే నెలలో మరోసారి ఇద్దరూ భేటీ కానున్నారు.

Related posts