telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

స్విమ్స్ లో కరోనాతో ఏడుగురి మృతి

Crime

కరోనా రోగులకు చికిత్స అందించడంలో ప్రైవేట్ ఆస్పత్రులు చేతులెత్తేయడంతో రాయలసీమ జిల్లాల ప్రజలకు స్విమ్స్, రుయా ఆస్పత్రులు మాత్రమే దిక్కుగా మారాయి. కరోనా టెస్టులు చేయించుకునేందుకు, పాజిటివ్ బారిన పడ్డవారు పెద్ద పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. రోగుల సంఖ్య రోజురోజుకూ అధికమవుతుండంతో వాళ్లకు వసతి కల్పించేందుకు వేరే అవకాశం లేక తిరుపతిలో భక్తుల కోసం నిర్మించిన సముదాయాలను క్వారంటైన్ కేంద్రాలుగా వాడు కోవాల్సిన పరిస్థితి నెలకొంది.తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, తిరుచానూరులోని పద్మావతి నిలయాలను క్వారంటైన్ కేంద్రాలుగా ఉపయోగించుకుంటున్నారు. సిమ్స్ హాస్పిటల్ లో మంగళవారం కరోనాతో ఏడుగురు మృతి చెందారు. చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురు, కడప జిల్లాకు చెందిన ముగ్గురు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒకరు కరోనాతో మృతి చెందినట్లు స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ తెలిపారు. చిత్తూరు జిల్లాలో సోమవారం రాత్రి 8 గంటల నుంచి మంగళవారం రాత్రి 9 గంటల వరకు 585 మందికి కరోనా నిర్ధారణ అయింది. సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు 12 గంటల వ్యవధిలో 114 కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 12 గంటల వ్యవధిలో ఏకంగా 71 కేసులు నమోదయ్యాయి. ఒక్క తిరుపతి నగరంలోనే 223 మంది కోవిడ్ బారిన పడ్డారు.

Related posts