telugu navyamedia
సినిమా వార్తలు

అల్లం అర్జున్ కుమార్‌కు పిల్ల కావాలెను

టాలీవుడ్‌ యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. విద్యా సాగర్ చింతా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సమర్పణలో, ఎస్‌విసిసి డిజిటల్ బ్యానర్ మీద ఆయన తనయుడు బాపినీడు సుధీర్ ఈదరతో కలిసి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి విశ్వక్‌ సేన్‌ వీడియోను విడుదల చేసింది మూవీ యూనిట్‌.

ఈ వీడియోలో విశ్వక్ సేన్ తన పొట్ట కనిపించకుండా టక్ చేసుకోవడం.. వయస్సు కనిపించకుండా బట్టతలను సరిదిద్దుకోవడం వంటివి నవ్వు తెప్పిస్తున్నాయి. ఇందులో తనకు మూడు పదుల వయస్సు దాటిపోయిందని.. పొట్ట కూడా వచ్చిందని.. తమ క్యాస్ట్ లో అమ్మాయి దొరకడం లేదని.. సంబంధం చూసిపెట్టమని ఆడియన్స్ ని అర్జున్ రిక్వెస్ట్ చేస్తున్నాడు. తనకు ఎలాంటి పట్టింపులు లేవని.. కట్నం కూడా వద్దని.. పూర్తి బియోడేటా ఇస్తా అమ్మాయిని మాత్రం చూసి పెట్టండి అంటూ అభ్యర్థించడం అలరిస్తోంది.

ఈ సందర్భంగా అల్లం అర్జున్ కుమార్ కు పిల్ల కావాలని చెబుతూ విడుదల చేసిన పోస్టర్ కూడా ఆకట్టుకుంది. చింతా మ్యారేజ్ బ్యూరో పేరుతో అర్జున్ బియోడేటాతో ఈ పోస్టర్ డిజైన్ చేయబడి ఉంది. ”అశోకవనంలో అర్జున కళ్యాణం” లో విశ్వక్ సేన్ గత చిత్రాల కంటే కంప్లీట్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకూ యూత్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్లతో యూత్ ఆడియన్స్ కి దగ్గరైన విశ్వక్.. ఈ సినిమాతో ఫ్యామిలీ ప్రేక్షకులను టార్గెట్ చేస్తున్నారని తెలుస్తోంది.

 

Related posts