telugu navyamedia
సినిమా వార్తలు

‘ఊ అంటావా.. ఊఊ అంటావా’ పుల్ వీడియో సాంగ్ రిలీజ్‌ ..

ఐకానిక్‌ స్టార్‌ అల్లు అర్జున్, క్రియేటివ్‌ డైరెక్టర్ సుకుమార్‌ కాంబినేషనల్‌లో వచ్చిన హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప. డిసెంబ‌ర్ 7న విడుద‌లై బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సునామీ సృష్టిస్తుంది.

ఎర్రచందనం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో స్మగ్లర్ గా బ‌న్నీ ఊర మాస లుక్ లో పుష్ప‌రాజ్ గా నటించి ఆకట్టుకున్నాడు. బన్నీ. ఇక పుష్పలోపుష్ప‌రాజ్‌కు జోడీగా శ్రీవ‌ల్లి (రష్మిక మందన్న)గా నటించింది. గ్రామీణ యువతిగా అమ్మడి నటన అందరిని అలరించింది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన దాక్కో దాక్కో మేక, సామి సామి వీడియో సాంగ్స్ సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేసాయి.

Samantha Ruth Prabhu

ముఖ్యంగా స్టార్‌ హీరోయిన్‌ సమంత డ్యాన్స్‌ చేసిన ‘ఊ అంటావా మావ.. ఉఉ అంటావా మావ’ సాంగ్‌కు ఎంత క్రేజ్‌ వచ్చిందో తెలిసిందే. యూట్యూబ్‌లో సాంగ్‌ రిలీజైన తర్వాత అదే రేంజ్‌లో దూసుకుపోయింది. సమంత స్టార్ హీరోయిన్‌గా రాణిస్తూనే ఈ ఐటెమ్ సాంగ్‌లో చేయ‌డం వల్ల ప్రేక్షకుల్లో మ‌రింత‌ ఆసక్తి పెరిగింది.

Samantha made a noise again; Video Song | Samantha Item song Of Pushpa Oo  AntavaOo Oo Antava Full Video Song Released | pipanews.com

అయితే ఈ సాంగ్‌ ఫుల్ వీడియో ఎప్పుడెప్పుడూ వస్తుందా అని ఎదురుచూసిన అభిమానుల‌కు శుక్రవారం (జనవరి 7) ‘ఊ అంటావా’ పూర్తి పాటను విడుదల చేసి హీట్ పెంచారు. ఇందులో సామ్ అందచందాలు, బన్నీ మాస్ స్టెప్స్ వేరే లేవ‌ల్లో ఉంది.

చంద్రబోస్‌ రాసిన ఈ పాట విడుదలైన కొద్ది క్షణాల్లోనే యూట్యూబ్‌లో ట్రెండ్‌గా మారింది. సుమారు 90 మిలియన్‌ వ్యూస్‌ని సొంతం చేసుకున్న ఈ సాంగ్‌ ‘టాప్‌ 100 మ్యూజిక్‌ వీడియోస్‌ గ్లోబల్‌’ జాబితాలో అగ్రస్థానంలో నిలిచి సరికొత్త రికార్డ్‌ నెలకొల‍్పింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సాంగ్‌లో ఇంద్రావతి చౌహన్ మాతెక్కించే వాయిస్ తో ఆలపించి ఆకట్టుకున్నారు.

Pushpa star Allu Arjun shuts down backlash over Samantha Ruth Prabhu's Oo  Antava item song with THIS BADASS reply

ఈ సినిమాలో ఫహద్‌ ఫాజిల్‌, అనసూయ, సునీల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Related posts