బిగ్ బాస్ సీజన్-3 తెలుగు కార్యక్రమం సక్సెస్‌ఫుల్‌గా తొమ్మిది వారాలు పూర్తి చేసుకొని పదో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. గత వారం హిమజ ఎలిమినేట్ అయ్యింది. పదో వారంలో శ్రీముఖి, రవి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్‌లలో ఒకరు ఇంటి నుండి బయటకి వెళ్లనున్నారు. ఎపిసోడ్ 66లో ఇంటి సభ్యులకి అత్త రాజ్యంలో కోడళ్ళ పాట్లు అనే టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్‌లో అత్తని మెప్పించి కొడుకులు, కోడళ్లు బ్రిక్ షాప్‌లో ఉన్న ఇటుకలతో కలిసి గోడ కట్టవలసి ఉంటుంది. ఎవరైతే పెద్ద గోడ కడతారో వారు కెప్టెన్ టాస్క్‌లో ఉంటారని బిగ్ బాస్ ఆదేశించారు. మంగళవారం రోజు ఈ టాస్క్ ప్రారంభం కాగా, బుధవారం కూడా కొనసాగింది. అత్తని మెప్పించేందుకు కొడుకులు వరుణ్ సందేశ్, రాహుల్, రవి కృష్ణ… కోడళ్ళు శ్రీముఖి, పునర్నవి, వితికాలు అష్టకష్టాలు పడ్డారు. అత్తకి మేనేజర్‌గా బాబా భాస్కర్ మరో అసిస్టెంట్‌గా మహేష్ వాళ్ల పాత్రకి తగ్గట్టు పర్‌ఫార్మెన్స్ ఇచ్చారు.
ఎపిసోడ్ 67లో అత్తగా ఉన్న శివజ్యోతి తనకి వితికా, వరుణ్ పర్‌ఫార్మెన్స్ నచ్చిందని అందుకే వారికి మిగతా జంటల కన్నా రెండు పాయింట్లు ఎక్కువగా ఇస్తున్నట్టు బాబా భాస్కర్‌కి చెప్పింది. ఇక బుధవారం రోజు పర్‌ఫార్మెన్స్ విషయానికి వస్తే శ్రీముఖి, రవికృష్ణ జంట పొద్దున్నే లేచి తనకి కావలసినవన్ని ఇచ్చారని పేర్కొంది. అందుకని ఈ రోజుకి గాను వాళ్లకి కొన్ని పాయింట్స్ ఇస్తున్నట్టు వెల్లడించింది. అనంతరం తన కొడుకులు, కోడళ్ళని పిలిచి మీకు కొన్ని ఇటుకలు ఇస్తాను వాటితో గోడ కట్టడం ప్రారంభించండి. మీ ప్రదర్శన బట్టి మిగతా ఇటుకలు ఇస్తానని వారితో చెప్పుకొచ్చింది శివజ్యోతి. గోడ కట్టే క్రమంలో ఒక్కో జంట గార్డెన్ ఏరియాలో ఉన్న ఇటుకలని తీసుకెళ్ళి కోర్డు యార్డ్‌లో గోడ కట్టడం ప్రారంభించారు. అయితే ఇటుకలు తీసుకెళ్లే క్రమంలో వారి దగ్గర ఇటుకలని లాక్కోవచ్చు. కాని గోడ కట్టిన తర్వాత వాటిని తీయడానికి వీల్లేదు అని బిగ్ బాస్ సూచనలు చేశారు. ఈ క్రమంలో గార్డెన్ ఏరియా నుండి ఇటుకలని తీసుకొస్తున్న వరుణ్ సందేశ్ దగ్గర కొన్ని ఇటుకలని లాగే ప్రయత్నం చేశాడు రాహుల్. వరుణ్ డిఫెండ్ చేయడం, రాహుల్ అడ్డుకోవడం ఇంతలో వెనుక నుండి రాహుల్‌ని గిల్లికజ్జాలు పెట్టడం వంటివి జరిగాయి.
అయితే వితికాని ఎందుకు గిచ్చుతున్నావు అని రాహుల్ గట్టిగా అరవడంతో వరుణ్ ఫైర్ అయ్యాడు. నువ్వు నన్ను నెట్టి పడేస్తే ఏం లేదు కాని గిచ్చితే వచ్చిందా అని రాహుల్‌పై విరుచుకు పడ్డాడు. వితికా కూడా రాహుల్‌ని టార్గెట్ చేస్తూ అరిచేసింది. గోడ మీద పిల్లిలా ఉండే పునర్నవి ఈ మేటర్‌లో ఏ మాత్రం ఇన్వాల్వ్ కాకుండా పక్కనుండి సినిమా చూసినట్టు చూస్తుంది. మిగతా ఇంటి సభ్యులు రాహుల్, వరుణ్‌ని ఎంత కాంప్రమైజ్ చేయాలని ప్రయత్నించిన ఇద్దరి మధ్య వాగ్వాదం పీక్ స్టేజ్‌కి చేరింది. మొన్నటి వరకు ఎంతో క్లోజ్‌గా ఉండే వారిద్దరు ఒక్కసారిగా శత్రువులుగా మారారు. మరి నేటి ఎపిసోడ్‌లో రాహుల్, వరుణ్ కలిసి చర్చించుకొని మళ్ళీ మిత్రులుగా మారతారా లేదంటే గొడవని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారా అన్నది చూడాలి.
సెట్లో ఆడవారితో బాలకృష్ణ తీరు ఇదే… బాలకృష్ణ అభిమానికి “నో” చెప్పిన పాకీజా