కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నబిగ్‌బాస్ సీజన్ 4లో గంగవ్వ అస్వస్థతకు గురయ్యారు. నాకు ఈ వాతావరణం పడటం లేదు అంటూ గంగవ్వ ఆవేదన వ్యక్తం చేశారు. నాకంటూ ఎవరూ లేరు అంటూ గంగవ్వ ఏడ్చింది. బిగ్‌బాస్ వెంటనే స్పందించి గంగవ్వను కన్ఫెషన్ రూమ్‌కు పిలిపించి నీ ఆరోగ్యం గురించి బెంగ పడొద్దు మీ ఆరోగ్యం గురించి డాక్టర్లు చూసుకుంటారు అని చెప్పారు. తనకు కాళ్లలో నొప్పులు ఉన్నాయని, ఆరోగ్యం సరిగా ఉండటం లేదు అని గంగవ్వ వివరించింది. ఇక్కడి వచ్చిన వారందరికి కొత్తలో ఇలానే ఉంటుందని కొద్ది రోజులు ఆగితే తగ్గిపోతుందని బిగ్ బాస్ తెలిపారు. మీరు టైమ్‌కు మందులు వేసుకోండి డాక్టర్లు మీ ఆరోగ్యాన్ని చూసుకొంటారు. మీరు నేరుగా డాక్టర్ వద్దకు వెళ్లండి అని చెప్పగా గంగవ్వ లాస్య సహాయంతో డాక్టర్ రూమ్‌కు వెళ్ళింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్న గంగవ్వ కారణంగా పల్లెప్రాంతాలలో సైతం బిగ్ బాస్ చుసేవారి సంఖ్య పెరిగి పోయింది.
previous post
next post