telugu navyamedia
సినిమా వార్తలు

విదేశాల్లో బాలీవుడ్ బ్యూటీ తో రానా విందు… ఫోటో వైరల్

Rana

“బాహుబలి”తో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ను సంపాదించుకున్న రానా దగ్గుబాటి ప్రస్తుతం తెలుగులో “విరాటపర్వం” సినిమాతో బిజీగా ఉన్నాడు. మరో వైపున తమిళ, హిందీ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. రానా ఇప్పుడు తెలుగులో “విరాటపర్వం”, హిందీలో “హాథీ మేరే సాథీ” సినిమాల్లో నటిస్తున్నారు. యాడ్స్ లోను నటిస్తున్నాడు. రానా ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడనే ప్రచారం జరిగింది. రానా ఈ వార్తలను ఖండించినప్పటికీ అవి మాత్రం ఆగలేదు. ఇటీవలే రానా.. లాస్ ఏంజెల్స్‌లో ఉన్నాను. వచ్చే నెలలో భారత దేశానికి తిరిగొస్తున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం రానా అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా క్యురేషితో కలసి రానా లంచ్ మీటింగ్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాలిఫోర్నియాలోని ఓ కామన్ ఫ్రెండ్ ఇంట్లో వీరిద్దరూ కలుసుకున్నారు. అక్కడ ఇండియన్ ఫుడ్ వండుకుని మరీ డిన్నర్ చేశారు. హ్యూమా క్యురేషి, రానా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తింటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే రానా ఈ ఫొటోలో మాత్రం ఫిట్ గానే కనిపిస్తున్నాడు. రానా “విరాట పర్వం”, “హిరణ్యకశ్యప”తో పాటు హిందీలో హౌస్‌ఫుల్ 4 సినిమాలతో పలకరించనున్నాడు.

Related posts