telugu navyamedia
సినిమా వార్తలు

బాహుబ‌లి ‘కట్టప్ప’కు క‌రోనా..

దేశంలో క‌రోనా థ‌ర్డ్ వేవ్ విజృంభిస్తుంది. రోజు రోజుకి కేసులు సంఖ్య పెర‌గుతునే ఉన్నాయి. ఈ క్రమంలో సెలబ్రిటీలు సామాన్యులు అన్న తేడా లేకుండా కరోనా మహమ్మారి క‌ల‌క‌లం సృష్టిస్తుంది.ముఖ్యంగా సినీ పరిశ్రమలో కరోనా తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేస్తుంది. గ‌త కొద్ది రోజులుగా బాలీవుడ్‌, టాలీ వుడ్, కోలీవుడ్ సినీ తార‌లు అందరూ వరుసగా వైరస్​ బారిన పడుతున్నారు.

ఇప్పటికే మహేష్ బాబు, మంచు మనోజ్‌, లక్ష్మీ, మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌, త్రిష, ప్రియదర్శన్‌, వరలక్ష్మి శరత్ కుమార్ , మీనా లతో పాటు పలువురు కరోనా బారినపడి చికిత్స తీసుకుంటున్నారు.తాజాగా కోలీవుడ్ సీనియర్ నటుడు సత్యరాజ్ (బాహుబ‌లి క‌ట్ట‌ప్ప‌)​కు కొవిడ్​ సోకింది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని అమింజిక్కరైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సత్యరాజ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

Sathyaraj

ఇటీవల కోవిడ్‌ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా రిజల్ట్స్ వచ్చాయి. దాంతో ఆయన అప్పటి నుంచి ఒంటరిగా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. గత రాత్రి సత్యరాజ్ పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యంపై అప్ డేట్ తెలియాల్సి ఉంది.

Related posts